Nalgonda: మిర్యాలగూడలో అక్రమ నిర్మాణాల వ్యవహారం కలకలం!

Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమ నిర్మాణాల కలకలం. అపార్ట్‌మెంట్ అనుమతులతో హాస్పిటల్ నిర్మాణం, రోడ్డు ఆక్రమణపై కాలనీవాసుల ఆగ్రహం, అధికారుల మౌనం.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 30 Oct 2026 5:32 PM IST
Nalgonda
X

Nalgonda: మిర్యాలగూడలో అక్రమ నిర్మాణాల వ్యవహారం కలకలం!

Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అక్రమ నిర్మాణాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, అపార్ట్‌మెంట్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని.. అందుకు భిన్నంగా హాస్పిటల్ నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.అంతేకాదు.. హాస్పిటల్‌కు అవసరమైన పార్కింగ్ కోసం ఏకంగా రోడ్డునే ఆక్రమిస్తున్నారంటూ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నివాస గృహాల మధ్య హాస్పిటల్ నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తారంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.ఈ నిర్మాణంపై ప్రశ్నించిన కాలనీవాసులకు.. ‘ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’ అంటూ దౌర్జన్యంగా సమాధానం చెప్పినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో కాలనీవాసుల ఆగ్రహం మరింత పెరిగింది.నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచే ఈ వ్యవహారంపై పట్టణ మున్సిపల్ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ఫిర్యాదులు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.అసలు అపార్ట్‌మెంట్ అనుమతులతో హాస్పిటల్ నిర్మిస్తున్నారా?

రోడ్డు ఆక్రమణ ఆరోపణల్లో వాస్తవమెంత?

కాలనీవాసుల ఫిర్యాదులపై మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదు?ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిర్మాణ అనుమతులను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA