Nalgonda: నల్గొండలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు: పాల్గొన్న కలెక్టర్ చంద్రశేఖర్
Nalgonda: నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజలకు దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
Nalgonda: నల్గొండలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు: పాల్గొన్న కలెక్టర్ చంద్రశేఖర్
నల్గొండ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.ఆదివారం అయన ఎన్జీ కళాశాల మైదానంలో విద్య ,అటవీ, ఆర్ అండ్ బి,తదితర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మలకు పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు, అన్ని గ్రామాలు ,మండలాలు, రెవెన్యూ డివిజన్లలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజు నుండి చివరి వరకు ప్రతిరోజు నాలుగైదు జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదానంలో ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడమే కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకోవడం సంతోషమని, అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారని తెలిపారు.
చివరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేశారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తో పాటు, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డిఇఓ సుశీందర్రావు, ఆర్ అండ్ బి ,అటవీ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.




