Nalgonda: పట్టభద్రుల ఓటరు నమోదుపై భూపాల్ రెడ్డి, రాకేశ్ రెడ్డి సమీక్ష!

Nalgonda: నల్లగొండలో పట్టభద్రుల ఓటరు నమోదుపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి వార్డుల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

Saleem, Nalgonda
Published on: 15 Oct 2026 3:01 PM IST
Nalgonda
X

Nalgonda: పట్టభద్రుల ఓటరు నమోదుపై భూపాల్ రెడ్డి, రాకేశ్ రెడ్డి సమీక్ష!

నల్గొండ: పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రతి ఇంటికీ తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

​గురువారం నగరంలోని 1 నుంచి 25 వార్డుల ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, పోటీ చేసిన అభ్యర్థులు (కాంటెస్టెడ్ కార్పొరేటర్లు) మరియు ఎన్‌రోలర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో వారు పాల్గొని, ఇప్పటి వరకు జరిగిన ఓటర్ల నమోదు సరళిని క్షుణ్ణంగా పరిశీలించారు.ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల విస్తృత పర్యటనలో పట్టభద్రుల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తోందని, ఇది భవిష్యత్తులో పార్టీ విజయానికి బలమైన పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

​"గతంలో సరిగ్గా ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టి పెట్టకపోవడం వల్లే స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం. ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాకూడదు. మూడు జిల్లాల్లోని 36 నియోజకవర్గాల్లో 34 చోట్ల అధికార పార్టీ, వారి మిత్రపక్షాలే ఉన్నాయి. వారి అధికార దుర్వినియోగాన్ని, ధనబలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఈ ఎన్నికల్లో గెలిస్తే.. రాబోయే సాధారణ ఎన్నికల్లో మన విజయానికి తిరుగుండదు. ప్రతి నాయకుడు ఓటరు నమోదునే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలి" అని రాకేష్ రెడ్డి కోరారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda