Chityala: చిట్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం మినీ వ్యాన్ ఢీకొని గౌస్ పాషా మృతి!

Chityala: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో మినీ వ్యాన్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో గౌస్ పాషా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 15 Oct 2026 9:49 PM IST
Chityala
X

Chityala: చిట్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం మినీ వ్యాన్ ఢీకొని గౌస్ పాషా మృతి!

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్యాల పట్టణానికి చెందిన గౌస్ పాషా మృతి చెందాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్ పాషా ఉరుమడ్లలో తన పని ముగించుకుని బైక్‌పై ఆరెగూడెం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన మినీ వ్యాన్‌ బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో గౌస్ పాషా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. గౌస్ పాషా మృతితో చిట్యాల పట్టణంలో విషాదం నెలకొంది.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA