Nalgonda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఫారం-18 పూర్తిచేసిన నర్సిరెడ్డి
Nalgonda: నల్లగొండ TSUTF కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు. ఫారం-18 ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకున్న పూర్వ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి.
Nalgonda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఫారం-18 పూర్తిచేసిన నర్సిరెడ్డి
నల్గొండ: రాబోయే ఖమ్మం - నల్లగొండ - వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా నల్లగొండ జిల్లా TSUTF కార్యాలయంలో ఓటరు నమోదు కార్యక్రమం వేగవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా పూర్వ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు మరియు టీఎస్ యుటిఎఫ్ (TSUTF) నాయకులు, కార్యకర్తలు ఫారం 18 (Form 18) ద్వారా ఆన్లైన్లో తమ ఓట్లను నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పూర్వ ఎమ్మెల్సీ మాట్లాడుతూ — అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఆన్లైన్ విధానం ద్వారా లేదా డిజిటల్ పద్ధతిలో ఫారం-18 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. డిగ్రీ పూర్తయిన ప్రతి పట్టభద్రుడూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా TSUTF కార్యకర్తలు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ సహాయక కేంద్రంగా నిలుస్తున్నారని తెలిపారు.




