Nalgonda: ఘనంగా డీవైఎఫ్‌ఐ 47వ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ!
Nalgonda: నల్లగొండలో డీవైఎఫ్‌ఐ 47వ ఆవిర్భావ దినోత్సవ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ. అవినీతి అంతం – DYFI పంతం నినాదంతో ముందుకుపోవాలని మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వీరారెడ్డి పిలుపు.
Nalgonda: 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అవినీతి అంతం – DYFI పంతం’ పోస్టర్‌ను బుధవారం స్థానిక కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ DYFI మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పాలది కార్తీక్, కార్యదర్శి గుండాల నరేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా యువత చైతన్యవంతమై పోరాడాలని పిలుపునిచ్చారు. DYFI ఆశయాలను విస్తృతంగా తీసుకెళ్తూ, అవినీతి రహిత సమాజ నిర్మాణం మరియు యువత హక్కుల సాధనకు పోరాటాలను మరింత ఉధృతం చేయాలని స్పష్టం చేశారు.




