Nalgonda: చట్టం ముందు అందరూ సమానులేననే సూత్రంతో పనిచేయాలి: ఎస్పీ!

Nalgonda: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది రాజ్యాంగ పీఠిక పఠించి ప్రతిజ్ఞ చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 26 Nov 2026 2:54 PM IST
Nalgonda
X

Nalgonda: చట్టం ముందు అందరూ సమానులేననే సూత్రంతో పనిచేయాలి: ఎస్పీ!

నల్గొండ: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మహనీయులను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగ పీఠికను పఠించి, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విధులు, బాధ్యతలు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను గౌరవిస్తూ వాటిని ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని, ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేసే గొప్ప మార్గదర్శకమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.

పోలీస్ శాఖలో రాజ్యాంగ స్ఫూర్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని, చట్టం ముందు అందరూ సమానులేననే సూత్రాన్ని పాటిస్తూ పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రజల భద్రత, చట్టాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ప్రజలకు సేవలందిస్తూ పోలీస్ శాఖపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఎస్పీ సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ డిఎస్పీ లు సైలేష్, ప్రభాత్ రెడ్డి, అఖిల్, ఎల్.శ్రీకాంత్, ఎమ్. శ్రీకాంత్, ఏ.ఓ. శివప్రసాద్, ఆర్.ఐలు సూరపు నాయుడు, సంతోష్, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET