Nalgonda: ఏఈఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి!

Nalgonda: నల్గొండ ఎస్పీఆర్ హైస్కూల్‌లో టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ బి. చంద్రశేఖర్. మొదటి రోజు 104 మంది హాజరు, 75 మంది గైర్హాజరు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 6 Nov 2026 4:32 PM IST
Nalgonda
X

Nalgonda: ఏఈఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి!

Nalgonda: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఈఈ (సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఆర్‌అండ్‌బీ) పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.​

శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ‘ఎస్పీఆర్ ఉన్నత పాఠశాల’లో ఏర్పాటు చేసిన ఏఈఈ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, నిర్వహణా తీరును పరిశీలించారు.​రెండు రోజుల పాటు కొనసాగే ఈ పరీక్షలకు గాను నల్గొండ కేంద్రానికి 179 మంది అభ్యర్థులను కేటాయించారు.

ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించిన మొదటి రోజు పరీక్షకు 104 మంది అభ్యర్థులు హాజరుకాగా, 75 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.​

పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, మరుగుదొడ్లు, వెలుతురు వంటి కనీస వసతులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ సభ్యురాలు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శశికళ, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నీలం రెడ్డి, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, టీజీపీఎస్సీ స్పెషల్ ఆఫీసర్ సతీష్ కుమార్, సంబంధిత పరిశీలకులు మరియు డిపార్ట్‌మెంటల్ అధికారులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET