Nalgonda: తీన్మార్ మల్లన్నకు డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత బహిరంగ లేఖ
Nalgonda: కుందూరు జానారెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఖండించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్.
Nalgonda: తీన్మార్ మల్లన్నకు డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత బహిరంగ లేఖ
నల్లగొండ: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి! సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మల్లన్నకు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న జానారెడ్డి అజాతశత్రువని, నక్సలైట్ల లొంగుబాటు నుంచి సాగు, తాగునీటి పథకాల వరకు జిల్లా అభివృద్ధికి ఆయనే మూలస్తంభమని లేఖలో పేర్కొన్నారు. నయీం లాంటి నరహంతకుడిని పెంచి పోషించిన బీఆర్ఎస్ను వదిలేసి, జానారెడ్డిపై నిందలు వేయడం మల్లన్న రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.
బీసీ, దళిత, గిరిజన నేతలను రాజకీయంగా ప్రోత్సహించిన మహానాయకుడు జానారెడ్డి అని స్పష్టం చేశారు.కేవలం రాజకీయ ప్రచారం కోసమే మల్లన్న ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సూర్యుడిపై ఉమ్మేస్తే అది మనపైనే పడుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
24 గంటల్లో జానారెడ్డికి, జిల్లా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన సెగ తప్పదని కైలాష్ నేత తీవ్రంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లాపల్లి పరమేష్,శాలిగౌరారం మండల అధ్యక్షుడు చింత ధనుంజయ్,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పగిళ్ల రాజు,చర్లపల్లి గౌతమ్,వేముల గోపీనాథ్,మట్టపల్లి నాగరాజ్,జమ్మూ అశోక్,ఆకటి సైదులు,ఎండి అజీజ్ తదితరులు పాల్గొన్నారు.




