Nalgonda: జానారెడ్డిపై వ్యాఖ్యలు ఉపసంహరించుకో తీన్మార్ మల్లన్నకు డీసీసీ హెచ్చరిక
Nalgonda: జానారెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఖండించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Nalgonda: జానారెడ్డిపై వ్యాఖ్యలు ఉపసంహరించుకో తీన్మార్ మల్లన్నకు డీసీసీ హెచ్చరిక
నల్లగొండ: సీనియర్ రాజకీయనాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తీవ్రంగా ఖండించారు.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న జానారెడ్డి, హింసకు తావులేని అజాతశత్రువని కొనియాడారు. బలహీన వర్గాల పక్షపాతి అయిన ఆయనపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జానారెడ్డి తనకు సహకరించారంటూ తీన్మార్ మల్లన్న అసత్య వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసిల రాజకీయ ఐక్యత కోసం పాటుపడాల్సింది పోయి, ఇలాంటి విమర్శలు చేయడం తగదన్నారు.
జానారెడ్డికి, జిల్లా ప్రజలకు 24 గంటల్లోగా తీన్మార్ మల్లన్న బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయన చేపడుతున్న పాదయాత్రలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




