Nalgonda: నవంబర్ 1న ఛలో ఢిల్లీని విజయవంతం చేయండి: కాంగ్రెస్ పిలుపు!

Nalgonda: ఓటు చోరీని నిరసిస్తూ నవంబర్ 1న నిర్వహించే ఛలో ఢిల్లీ ర్యాలీని విజయవంతం చేయాలని నల్లగొండ కాంగ్రెస్ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 26 Oct 2026 5:48 PM IST
Nalgonda
X

Nalgonda: నవంబర్ 1న ఛలో ఢిల్లీని విజయవంతం చేయండి: కాంగ్రెస్ పిలుపు!

నల్గొండ: SIR ప్రక్రియలో జరిగిన ఓటు చోరిని నిరసిస్తూ నవంబర్ 1న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు AICC పరిశీలకులు రాంభూపాల్ , TPCC ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవన్ లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సమావేశం నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత అధ్యక్షతన జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ..మోదీ,అమిత్ షా, CEC ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ లు కుట్ర పూరితంగా దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓటర్లను తొలగించారని ఇది దేశానికి ప్రజా సామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు.

గత 12 సంవత్సరాల మోడీ పాలనలో దేశంలో SC,ST,OBC, మైనార్టీలు,ఆదివాసులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని దేశంలోని జంజి కూడా BJP పాలనపై విసుగు చెందారని అందుకే ఓట్ చోరికి పాల్పడుతున్నారని విమర్శించారు. CBI,ED లాంటి చట్టబద్ధమైన స్వతంత్ర్యంగా ఉండాల్సిన CEC నీ కూడా దుర్వినియోగానికి పాల్పడిన మోడీ గద్దె దిగాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.

నవంబర్ 1న చలో ఢిల్లీ రాంలీలా మైదాన్ లో జరిగే మహా కూటమి (ఇండియా కూటమి) ర్యాలీకి జిల్లా నుంచి సుమారు 2000 మంది రావాలని పిలుపునిచ్చారు. CEC జ్ఞానేష్ కుమార్ ను తక్షణం పదవి నుంచి తొలగించి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటును కాపాడుకుందాం - దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ఛలో ఢిల్లీ చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బోడ స్వామి, టీపీసీసీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్,INTUC జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య,మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి బాలకృష్ణ, నల్గొండ జిల్లా వివిధ మండల పార్టీ అధ్యక్షులు గథగోని కొండయ్యా, లింగాల వెంకన్న,ఎడ్ల ప్రవీణ్, అల్లంపల్లి జానయ్య,గాయం శామ్ సుందర్ రెడ్డి,ఎదులపురి కృష్ణ,ఎల్లంపల్లి నరసింహ,మరల చంద్ర రెడ్డి,మేకల సాగర్ రెడ్డి,భీమనపల్లి సైదులు,

మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ, అల్లంపల్లి నరసింహ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు మేకల రాజేందర్ రెడ్డి, పోసిరెడ్డి సంతోష్ రెడ్డి,కుకుడాల బాలకృష్ణ,గోపిశెట్టి రాంబాబు, ఏళ్ల రవీందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శులు పగిళ్ళ రాజు,దామనూరి అశోక్,చర్లపల్లి గౌతమ్, చెవుగిని శ్రీనివాస్,కురుపాటి గణేష్, వేముల గోపీనాథ్,ఇందనూరి శ్రీను,సూర ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,NSUI, YOUTH CONGRESS తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET