Nalgonda: బాల్య వివాహ రహిత జిల్లాగా నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్
Nalgonda: నల్గొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, డిసెంబరు 15 వరకు పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా నిఘా ఉంచాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.
Nalgonda: బాల్య వివాహ రహిత జిల్లాగా నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్
నల్గొండ: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, నల్గొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని, వారికి నాణ్యమైన విద్య అందించి ప్రోత్సహించాలని సూచించారు. డిసెంబరు 15 వరకు పెళ్లిళ్ల సీజన్ ఉన్నందున గ్రామాలు, తండాలలో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో లావణ్య కుమారి, డీఎంహెచ్వో రాహుల్ తదితరులు పాల్గొన్నారు.




