Nalgonda: నల్లగొండలో 'స్వేచ్ఛ రథాన్ని' ప్రారంభించిన కలెక్టర్ బి. చంద్రశేఖర్!

Nalgonda: నల్లగొండ జిల్లాలో వెట్టిచాకిరి, బానిసత్వాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ఉద్దేశించిన 'స్వేచ్ఛ రథాన్ని' కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ ప్రారంభించారు.

Saleem, Nalgonda
Published on: 19 Oct 2026 2:21 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో 'స్వేచ్ఛ రథాన్ని' ప్రారంభించిన కలెక్టర్ బి. చంద్రశేఖర్!

Nalgonda: జిల్లాలో వెట్టిచాకిరి, బానిసత్వాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అందరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 'స్వేచ్ఛ రథాన్ని' సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వెట్టిచాకిరి అనాదిగా వస్తున్న సామాజిక రుగ్మత అని, దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే 20 రోజుల పాటు జిల్లాలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సంతలు, గ్రామ చావడీల వద్ద కళాకారుల ఆటపాటలు, దృశ్య రూపకాలు, గోడపత్రికల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు.

​వెట్టిచాకిరి సమాచారం తెలిస్తే వెంటనే 08069434343 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. ఈ విషయంలో కార్మిక, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం వెట్టిచాకిరి నిర్మూలన గోడపత్రికను ఆవిష్కరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda