Nalgonda: నల్లగొండలో పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం చేయాలి కలెక్టర్!
Nalgonda: నల్లగొండ 2026-27 విపణి సంవత్సరానికి పత్తి కొనుగోళ్లను సత్వరమే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
Nalgonda: నల్లగొండలో పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం చేయాలి కలెక్టర్!
Nalgonda: జిల్లాలో 2026-27 విపణి సంవత్సరానికి సంబంధించి పత్తి కొనుగోళ్లను సత్వరమే ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మార్కెటింగ్, వ్యవసాయ, ఇతర అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5,93,795 ఎకరాల్లో పత్తి సాగైందని తెలిపారు. సుమారు 3,56,257 మెట్రిక్ టన్నుల దిగుబడి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పక్కా ప్రణాళికతో ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.




