Nalgonda: రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

Nalgonda: నల్లగొండ తాగునీటి పరిస్థితి, ఎల్ నినో ప్రభావంపై కలెక్టర్ బి. చంద్రశేఖర్ సమీక్ష. నీటి వృథాను అరికట్టి జీరో వేస్టేజ్ గ్రామాలుగా ప్రకటించాలని ఆదేశం.

Saleem, Nalgonda
Published on: 22 Oct 2026 6:25 PM IST
Nalgonda
X

Nalgonda: రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

నల్గొండ: రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా అందుబాటులో ఉన్న వనరులను జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు.

గురువారం తన చాంబర్‌లో ఎల్ నినో ప్రభావం, తాగునీటి పరిస్థితిపై ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు, ఐఐటీ నిపుణులతో సమీక్ష నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 7 మండలాల్లో సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ, ముందుముందు నీటిమట్టాలు తగ్గే అవకాశముందన్నారు.

గ్రామ, మండల, పురపాలక ప్రాంతాల్లో లభ్యమయ్యే నీటి వివరాలను వెంటనే సేకరించి ఆడిట్ నివేదిక అందించాలని డీపీఓను ఆదేశించారు.

తాగునీటి పైప్‌లైన్ల లీకేజీలను అరికట్టాలని, నీరు వృథా కాని ప్రాంతాలను 'జీరో వేస్టేజ్' గ్రామాలు/జోన్లుగా ప్రకటించాలని స్పష్టం చేశారు. నీటి సంరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda