Munugode: పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరపాలి కలెక్టర్ బి. చంద్రశేఖర్

Munugode: మునుగోడు సల్సార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బి. చంద్రశేఖర్ తనిఖీ చేశారు. తూకాలు, తేమ శాతాన్ని పరిశీలన.

Saleem, Nalgonda
Published on: 22 Oct 2026 6:33 PM IST
Munugode
X

Munugode: పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరపాలి కలెక్టర్ బి. చంద్రశేఖర్

మునుగోడు: పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ళు పారదర్శకంగా జరిపించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

గురువారం మునుగోడు సమీపంలోని సల్సార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటుచేసిన ‘కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ) కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కొనుగోళ్ల నమోదు, తూకాలు, తేమ శాతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువగా క్వింటాలుకు ₹9,160 వరకు రైతులకు లభిస్తుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

సీసీఐ, మిల్లుల రిజిస్టర్లలో తూకాల తేడాలు రాకుండా పక్కాగా రికార్డులు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda