Nalgonda: నల్గొండ గడియారం సెంటర్‌లో జ్యోతిరావు ఫులేకు ఘన నివాళులు!

Nalgonda: మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతిని పురస్కరించుకుని నల్గొండ పట్టణం గడియారం సెంటర్‌లో ఆయన విగ్రహానికి డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

Saleem, Nalgonda
Published on: 28 Nov 2026 12:10 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ గడియారం సెంటర్‌లో జ్యోతిరావు ఫులేకు ఘన నివాళులు!

నల్గొండ: సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నల్గొండ పట్టణం గడియారం సెంటర్‌లో ఆయన విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్య కోసం ఫులే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. సత్యనారాయణ, మాధవి, సాయిబాబా, యాదయ్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda