Nalgonda: నల్లగొండ క్లాక్ టవర్ వద్ద బీజేపీ ఫ్లెక్సీ తొలగింపుపై ఉద్రిక్తత!
Nalgonda: నల్లగొండ క్లాక్ టవర్ వద్ద బీజేపీ ఫ్లెక్సీ తొలగింపుపై జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆగ్రహం. అందరికీ ఒకే రూల్ ఉండాలని డిమాండ్ చేస్తూ తిరిగి ఫ్లెక్సీ ఏర్పాటు.
Nalgonda: నల్లగొండ క్లాక్ టవర్ వద్ద బీజేపీ ఫ్లెక్సీ తొలగింపుపై ఉద్రిక్తత!
నల్గొండ: నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సమీపంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీని తొలగించడంపై బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒకే విధమైన నిబంధనలు, ఒకే విధమైన ప్రమాణాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒక పార్టీకి ఒక రకమైన నిబంధనలు, మరో పార్టీకి మరో రకమైన నిబంధనలు ఉండకూడదని స్పష్టం చేశారు.ఫ్లెక్సీని తొలగించిన అనంతరం అక్కడే ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు తొలగించిన ఫ్లెక్సీని తిరిగి ఏర్పాటు చేశారు. “అందరికీ ఒకే న్యాయం – ఒకే నిబంధన” అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఫ్లెక్సీ తొలగింపుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను బీజేపీ నాయకులు కోరారు.




