Nalgonda: అక్టోబర్ 25, 26 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద సీఐటీయూ మహాధర్నా!

Nalgonda: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై అక్టోబర్ 25, 26 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సలీమ్ పిలుపు.

Saleem, Nalgonda
Published on: 17 Oct 2026 1:22 PM IST
Nalgonda
X

Nalgonda: అక్టోబర్ 25, 26 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద సీఐటీయూ మహాధర్నా!

Nalgonda: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించే 'మహాధర్నా'ను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీమ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా సలీమ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనం రూ.42,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, స్కీమ్ వర్కర్ల క్రమబద్ధీకరణ వంటి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda