Nalgonda: చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.39.53 లక్షలు
Nalgonda: చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.39.53 లక్షలు. 67 రోజుల్లో వచ్చిన కానుకలు అని వెల్లడించిన ఆలయ అధికారులు.
Nalgonda: చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.39.53 లక్షలు
నల్లగొండ: నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి హుండీ కానుకల లెక్కింపు మంగళవారం ఘనంగా జరిగింది. గడిచిన 67 రోజులకు గానూ స్వామివారికి మొత్తం ₹39,53,542 నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
గుట్టకింద అమ్మవారి ఆలయ హుండీ ద్వారా ₹4,69,410 రాగా, గట్టుపైన ఉన్న ప్రధాన ఆలయ హుండీ ద్వారా ₹34,84,132 ఆదాయం లభించింది. ఇవి కాకుండా అన్నదాన హుండీ ద్వారా అదనంగా ₹37,771 విరాళాలుగా వచ్చాయి.
ఆలయ ఈవో ఎస్. మోహన్ బాబు, పాలకమండలి ఛైర్మన్ వారాల రమేష్ పర్యవేక్షణలో సిబ్బంది ఈ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.




