Nalgonda: నిరుపేద విద్యార్థినికి విజ్ఞాన్ కాలేజీ అండ: ఫీజు మాఫీ!
Nalgonda: ఇంటర్‌లో 974 మార్కులు సాధించిన నల్గొండకు చెందిన నిరుపేద విద్యార్థిని నోముల రిషితకు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్తి ఫీజు మాఫీ చేసి అండగా నిలిచింది.
Nalgonda: నిరుపేద విద్యార్థినికి విజ్ఞాన్ కాలేజీ అండ: ఫీజు మాఫీ!
నల్గొండ: కష్టపడి చదివే నిరుపేద విద్యార్థులకు దాతలు అందిస్తున్న చేయూత కొండంత భరోసానిస్తోంది. ఇంటర్మీడియట్ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచిన నల్గొండ పట్టణం బొట్టుగూడకు చెందిన విద్యార్థిని నోముల రిషిత పైచదువులకు ఆర్థిక సాయం దక్కింది.
ప్రతిభను గుర్తించిన కాలేజీ యాజమాన్యం:
2024–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నోముల రిషిత (తండ్రి: విజయ్)... 1000 కి గాను 974 మార్కులు సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఆమె ఆర్థిక పరిస్థితిని మరియు అత్యుత్తమ మార్కులను గుర్తించిన ఘట్కేసర్‌లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం స్పందించింది. సీఈసీ (CEC) బ్రాంచ్‌లో కాలేజీ ఫీజు పూర్తిగా మాఫీ చేసి, కేవలం హాస్టల్ ఫీజు రూ. 1,10,000/- కే ఇంజనీరింగ్ చదివేందుకు అవకాశం కల్పించింది.




