Nakrekal: బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చలకాని వెంకన్నకు ఘన సన్మానం
Nakrekal: తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన చలకాని వెంకన్నను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండలో ఘనంగా సన్మానించారు.
Nakrekal: బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చలకాని వెంకన్నకు ఘన సన్మానం
నల్గొండ: తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చలకాని వెంకన్న ఘన సన్మానం, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికై , మొట్టమొదటిసారిగా నకిరేకల్ నియోజకవర్గానికి విచ్చేసిన చలకాని వెంకన్న ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చలకాని వెంకన్న శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
ఈ సన్మాన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతు నకిరేకల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయిలో ఇంతటి ఉన్నత పదవిని చేపట్టడం నియోజకవర్గానికే గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.




