Nalgonda: జల్సాల కోసం దొంగగా మారిన సినీ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్!

Nalgonda: సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి జల్సాల కోసం దొంగగా మారిన కడియం ప్రశాంత్ అరెస్ట్. నల్లగొండలో ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు.

Saleem, Nalgonda
Published on: 3 Nov 2026 7:58 AM IST
Nalgonda
X

Nalgonda: జల్సాల కోసం దొంగగా మారిన సినీ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్!

Nalgonda: నల్లగొండలో సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కడియం ప్రశాంత్ అనే వ్యక్తి జల్సాల కోసం దొంగగా మారాడు. రైళ్లలో ప్రయాణిస్తూ ప్రయాణికుల ల్యాప్‌టాప్‌లను అపహరిస్తున్న ప్రశాంత్‌ను రైల్వే పోలీసులు నల్లగొండ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సురేందర్ గౌడ్ తెలిపారు.విచారణ అనంతరం సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు తరలించామని సీఐ వెల్లడించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda