Nalgonda: నల్గొండ లేబర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

Nalgonda: కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ లేబర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ నేత పల్లె దేవేందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Saleem, Nalgonda
Published on: 13 Nov 2026 5:30 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ లేబర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

నల్గొండ: కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకుడు పల్లె దేవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వం, అధికారులు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించి, కనీస వేతనాలు అమలు చేయాలని నినాదాలు చేశారు.

అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda