Nalgonda: దేవరకొండలో పట్టభద్రుల ఓటరు నమోదు హెల్ప్ డెస్క్ ప్రారంభం!
Nalgonda: నల్గొండ జిల్లా దేవరకొండలో పట్టభద్రుల ఓటరు నమోదు హెల్ప్ డెస్క్ ప్రారంభం. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి పిలుపు.
Nalgonda: దేవరకొండలో పట్టభద్రుల ఓటరు నమోదు హెల్ప్ డెస్క్ ప్రారంభం!
Nalgonda: పట్టభద్రుల గొంతుక శాసనమండలిలో బలంగా వినిపించాలంటే ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత అవసరమని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుపల్లా నర్సింహా రెడ్డి పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్),అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో నల్లగొండ -ఖమ్మం -వరంగల్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్(పట్టభద్రుల) ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన, నమోదు కార్యక్రమం దేవరకొండ పల్లా పర్వత్ రెడ్డి భావన్లో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది, ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పల్లా నర్సింహా రెడ్డి, పల్లా దేవేందర్ రెడ్డి హాజరై ఫారం 18 ప్రతులను పట్టభద్రులకు అందించి, ప్రారంభించారు.
ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి. మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన గొప్ప హక్కులో ఓటు హక్కు ఒకటి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు..మన భవిష్యత్తును నిర్ణయించే శక్తి కూడా ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుల పాత్ర చాలా కీలకం. సమాజంలో మార్పు రావాలంటే విద్యావంతులు రాజకీయ ప్రక్రియలో భాగస్వాములు కావాలి. 2023 డిసెంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ నల్లగొండ –ఖమ్మం –వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నామన్నారు.
నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యారంగ సమస్యలు, యువత భవిష్యత్తు వంటి కీలక అంశాలపై తమ గళాన్ని వినిపించేందుకు పట్టభద్రుల ఓటు ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య ఆయుధమన్నారు. ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదని .. సామాజిక బాధ్యత కూడా అని అన్నారు.
పట్టభద్రులు ఓటరు నమోదుపై నిర్లక్ష్యం వహించకుండా, అవసరమైన పత్రాలతో నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు . ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు కూడా ప్రస్తుత అధికారిక మార్గదర్శకాలను పరిశీలించి తమ నమోదు స్థితిని నిర్ధారించుకోవాలన్నారు . ప్రతి అర్హుడైన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడం, యువతలో ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించడం మా లక్ష్యమన్నారు .
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎనమల నవీన్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి నూనె రామస్వామి,ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సూరిగి వినయ్, వట్టేపు శివకుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ శంశోద్దీన్,సిపిఐ,ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ నాయకులు జూలూరి జ్యోతిబస్, బొమ్ము రామాజనేయులు,జూలూరి జ్యోతిబస్,నూనె వెంకటేశ్వర్లు, జూలూరి మహేష్,ఎండి జామిల్,మేగవత్ బాబు, వి బాలు,పెంటమళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




