Nalgonda: ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు.. ప్రాంగణాన్ని పరిశీలించిన విజ్జు కృష్ణన్
Nalgonda: నల్లగొండలో నవంబరు 15-18 వరకు ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు. బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్. 1200 మంది ప్రతినిధులు హాజరు.
Nalgonda: ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు.. ప్రాంగణాన్ని పరిశీలించిన విజ్జు కృష్ణన్
నల్లగొండ: రైతాంగ సమస్యలపై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు నల్లగొండ గడ్డ వేదిక కానుంది. నవంబరు 15 నుంచి 18 వరకు పట్టణంలో జరగనున్న 36వ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) మహాసభల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.
గురువారం బహిరంగ సభ స్థలాన్ని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్.. రైతు సంఘం రాష్ట్ర నాయకులతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 1200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. కిసాన్ సభ 90వ ఏట అడుగుపెడుతున్న వేళ, తెలంగాణ సాయుధ పోరాట 90వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతోందని, ఈ దాడికి వ్యతిరేకంగా పోరాట వ్యూహాన్ని మహాసభల్లో ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ సంఘంలో 1.58 కోట్ల మంది సభ్యులున్నారని వెల్లడించారు.




