Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి

Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అడిషనల్ సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశం. నల్గొండ జిల్లా ఈఆర్వోలతో సమీక్ష.

Saleem, Nalgonda
Published on: 29 Oct 2026 5:21 PM IST
Nalgonda
X

Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి

నల్గొండ: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశించారు.

గురువారం నల్గొండ కలెక్టరేట్‌లోని ఆర్వో ఛాంబర్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఈఆర్వోలు, ఆర్డీవోలతో ఓటరు నమోదుపై ఆయన సమీక్ష నిర్వహించారు.

​ఈ సందర్భంగా అడిషనల్ సీఈఓ మాట్లాడుతూ.. ఫారం-18 ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్షుణ్నంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు.

నల్గొండ జిల్లా నమోదు ప్రక్రియలో ముందుండడం పట్ల కలెక్టర్, ఈఆర్వోలను అభినందించారు. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో కూడా వేగం పెంచాలని సూచించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda