Nakrekal: నకిరేకల్ మండలంలో ఘనంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకలు!
Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలో ఘనంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకలు. కొత్త ఇళ్లను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం.
Nakrekal: నకిరేకల్ మండలంలో ఘనంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకలు!
Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని తాటికల్, చందంపల్లి గ్రామాల్లో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమం పండుగ వాతావరణంలో వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇంటి యజమానులను శాలువాలతో సన్మానించి, స్వీట్లు తినిపించారు.అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి చూపించామన్నారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన మరిన్ని ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.




