Nakrekal: నకిరేకల్‌లో ఘనంగా 104 మంది గర్భిణీలకు సామూహిక సీమంతాలు!
Nakrekal: నకిరేకల్‌లో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో 104 మంది గర్భిణీలకు సామూహిక సీమంతాల వేడుక ఘనంగా నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ వేముల వీరేశం.
Nakrekal: వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, ఆధ్వర్యంలో నకిరేకల్ లోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో 104 మంది మహిళలకు సామూహిక సీమంతాల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు హాజరయ్యారు.
గర్భిణీ స్త్రీలకు పసుపు, కుంకుమ, చీర, పండ్లు అందజేసి ఆశీర్వదించారు. మహిళల సంక్షేమం కోసం వాసవి క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే గారు అభినందించారు .
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్దా వెంకట సూర్య ప్రకాశ రావు గారు, గజ్జల రామకృష్ణ గారు, గవర్నర్ వీరెల్లి సతీష్ కుమార్ గారు, క్లబ్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




