Nakrekal: నకిరేకల్ ఎర్రగుంట చెరువు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు!

Nakrekal: నకిరేకల్ ఎర్రగుంట చెరువు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. కృష్ణా జలాలను తరలించి చెరువులు నింపిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 4 Nov 2026 11:04 AM IST
Nakrekal
X

Nakrekal: ​కరువు కాలంలో కృష్ణా జలాలను తరలించి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ అన్నారు. తీవ్ర ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడక, చెరువులు, కుంటలు బీటలు వారి రైతులు అల్లాడిపోతున్న సమయంలో కృష్ణా నీళ్లను కాలువల ద్వారా తెప్పించి చెరువులు నింపారని కొనియాడారు.​

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట చెరువు అలుగు వద్ద కాలనీ ప్రజలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె పసుపు, కుంకుమ, పూలు సమర్పించి, కొబ్బరికాయ కొట్టి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల కళ్లలో ఆనందం నింపిన ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజల తరఫున, రైతుల తరఫున ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET