Nakrekal: నకిరేకల్‌లో ఎల్ నినో ప్రభావంపై ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్ష!
Nakrekal: నకిరేకల్‌లో ఎల్ నినో ప్రభావం, నివారణ చర్యలపై సమీక్ష. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరు.
Nakrekal: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ స్థాయిలో ఎల్ నినో ప్రభావం, నివారణ చర్యలపై అధికారులతో ప్రజాప్రతినిధులు కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎల్ నినో వల్ల రైతాంగానికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎంపీ చామల ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలగకుండా శాఖల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. బాధ్యతల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




