Nakrekal: ఉపాధ్యాయురాలు కవిత పదవీ విరమణ సభ ఘనంగా నిర్వహణ

Nakrekal: నకిరేకల్ మండలం నోముల పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు ముస్కు కవిత పదవీ విరమణ సభ ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆమెను సత్కరించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 30 Oct 2026 9:20 PM IST
Nakrekal
X

Nakrekal: ఉపాధ్యాయురాలు కవిత పదవీ విరమణ సభ ఘనంగా నిర్వహణ

నకిరేకల్: నకిరేకల్ మండలం నోముల ZPHS పాఠశాలలో సైన్స్ (బయోసైన్స్) ఉపాధ్యాయురాలు శ్రీమతి ముస్కు కవిత - శేఖర్ రెడ్డి పదవీ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం * హాజరై, ఉపాధ్యాయురాలు ముస్కు కవిత గారు విద్యారంగానికి అందించిన సేవలను కొనియాడారు.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL