Nalgonda: అగ్రరాజ్యాల దురాక్రమణలు మానవాళికి పెనుముప్పు ఎమ్మెల్సీ నెల్లికంటి

Nalgonda: నల్లగొండలో జరిగిన ఏఐపీఎస్ఓ మహాసభలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. అగ్రరాజ్యాల దురాక్రమణలు మానవాళి మనుగడకే ముప్పని విమర్శించారు.

Saleem, Nalgonda
Published on: 10 Oct 2026 6:50 PM IST
Nalgonda
X

Nalgonda: అగ్రరాజ్యాల దురాక్రమణలు మానవాళికి పెనుముప్పు ఎమ్మెల్సీ నెల్లికంటి

నల్లగొండ: సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో అగ్రరాజ్యాలు సాగిస్తున్న దురాక్రమణలు మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారాయని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధ్వజమెత్తారు.

నల్లగొండలో నిర్వహించిన ఏఐపీఎస్ఓ జిల్లా మహాసభలో ఆయన దిశానిర్దేశం చేశారు.లాభాపేక్షతో చిన్న దేశాలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తూ, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న యుద్ధాలను ప్రజాస్వామిక శక్తులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ ఘర్షణల కారణంగా దేశీయంగా నిత్యావసరాలు, ఇంధన ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తులను నిలువరించి, శాంతి సౌభాగ్యాలతో కూడిన సమసమాజ స్థాపనే లక్ష్యంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై నిలవాలని ఉద్బోధించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda