Suryapet: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి!

Suryapet: నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 30 Sept 2026 1:51 PM IST
Suryapet
X

Suryapet: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి!

Suryapet: నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు, ప్రచార నిర్వహణ, గ్రాడ్యుయేట్ ఓటర్లను సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన పార్టీ అధిష్టానానికి, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కు సర్వోత్తమ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA