Nakrekal: అయ్యప్ప స్వాములకు 45 రోజుల పాటు అన్నప్రసాద వితరణ!

Nakrekal: నకిరేకల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సొంత నిధులతో 45 రోజుల పాటు రోజూ అన్నప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 12 Nov 2026 2:06 PM IST
Nakrekal
X

Nakrekal: అయ్యప్ప స్వాములకు 45 రోజుల పాటు అన్నప్రసాద వితరణ!

Nakrekal: నకిరేకల్ పట్టణం అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాముల కోరిక మేరకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సొంత నిధులతో బిక్ష ( అన్న ప్రసాదం ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా రేపటి నుంచి 45 రోజుల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం అయ్యప్ప స్వాములకు భిక్ష (అన్నప్రసాదం) అందించే కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL