Nalgonda: మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సైకి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు!
Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై అత్తి సతీష్ నేరేడుచర్ల మండలం రామగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
Nalgonda: మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సైకి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు!
Nalgonda: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామగిరి వద్ద రోడ్డు ప్రమాదంలో ఎస్సై అత్తి సతీష్(34) కు తీవ్ర గాయాలైనాయి. నేరేడుచర్ల మండలంలోని కందుల వారి గూడెం గ్రామానికి చెందిన అత్తి సతీష్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతినిత్యం ఇంటికి వచ్చి వెళ్తుంటాడు.
అదే క్రమంలో బుధవారం విధులు నిర్వహించడానికి బైక్ పై వెళ్తుండగా రామగిరి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీప ప్రజలు 108 లో మిర్యాలగూడ లీల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.




