Miryalaguda: మిర్యాలగూడలో ముగ్గురు బైక్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు!

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముగ్గురు బైక్ దొంగలను టూ టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి, మూడు ఖరీదైన బైకులు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 26 Nov 2026 10:13 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడలో ముగ్గురు బైక్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు!

నల్గొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి వద్ద నుంచి దొంగిలించిన మూడు ద్విచక్ర వాహనాలతో పాటు మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వాహనాల్లో రెండు పల్సర్ NS 200 బైకులు, ఒక కేటీఎం డ్యూక్ బైక్ ఉన్నాయి. అరెస్టయిన ముగ్గురు నిందితులు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

అనంతరం ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ వాహనాలను భద్రంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA