Miryalaguda: అక్రమ ఇసుక ట్రాక్టర్ల సీజ్ ఎస్సై ఉప్పు నగేష్ ఆకస్మిక తనిఖీలు

Miryalaguda: యాదగిరిపల్లి వద్ద ఎస్సై ఉప్పు నగేష్ ఆకస్మిక తనిఖీలు. కామేపల్లిగూడెం మూసీ నుండి మిర్యాలగూడకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్ల సీజ్, కేసు నమోదు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 7 Nov 2026 6:55 PM IST
Miryalaguda
X

Miryalaguda: అక్రమ ఇసుక ట్రాక్టర్ల సీజ్ ఎస్సై ఉప్పు నగేష్ ఆకస్మిక తనిఖీలు

మిర్యాలగూడ: రోజు తెల్లవారుజామున యాదగిరి పల్లి గ్రామ శివారులో ఎస్సై ఉప్పు నగేష్ మరియు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కామేపల్లిగూడెం మూసి నుండి మిర్యాలగూడ వైపు అక్రమంగా, దొంగతనంగా ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది.

అట్టి ట్రాక్టర్ల డ్రైవర్లు తడకమళ్ళ గ్రామానికి చెందిన చందు మరియు పేరయ్య లపై మరియు అట్టి ట్రాక్టర్ యజమానులు కామేపల్లిగూడెం కు చెందిన వారిపైన కూడా కేసు నమోదు చేసి అట్టి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగినది.

ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా దొంగతనంగా ఇసుకను రవాణా చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే అట్టి వ్యక్తులను బైండ్ఓవర్ కూడా చేయడం జరుగుతుంది

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA