Nalgonda: అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. రెండు ట్రాక్టర్లు సీజ్!

Nalgonda: మిర్యాలగూడ యాదగిరిపల్లి శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రూరల్ ఎస్సై ఉప్పు నగేష్ పట్టుకుని సీజ్ చేశారు. నలుగురిపై కేసు నమోదైంది.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 27 Nov 2026 9:36 AM IST
Nalgonda
X

Nalgonda: అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. రెండు ట్రాక్టర్లు సీజ్!

Nalgonda: అక్రమ ఇసుక రవాణాపై మిర్యాలగూడ రూరల్ పోలీసులు కొరడా ఝుళిపించారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు.వివరాల్లోకి వెళితే నవంబర్ 16వ తేదీ తెల్లవారుజామున యాదగిరిపల్లి గ్రామ శివారులో మిర్యాలగూడ రూరల్ ఎస్సై ఉప్పు నగేష్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కామేపల్లిగూడెం మూసీ పరివాహక ప్రాంతం నుంచి మిర్యాలగూడ వైపు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించి పట్టుకున్నారు.

మొదటి ట్రాక్టర్ డ్రైవర్ నారబోయిన సతీష్, యజమాని ఉత్తర్ల గోపితో పాటు, రెండో ట్రాక్టర్ డ్రైవర్ నల్లమేకల చందు, యజమాని సల్లోజు సతీష్‌పై కేసులు నమోదు చేశారు. రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు.అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఉప్పు నగేష్ హెచ్చరించారు. పట్టుబడిన ట్రాక్టర్లను తదుపరి చర్యల నిమిత్తం నల్గొండ జిల్లా మైనింగ్ అధికారులకు పంపనున్నట్లు తెలిపారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA