Miryalaguda: మిర్యాలగూడలో తూనికల శాఖ దాడులు

Miryalaguda: మిర్యాలగూడలోని రైస్ మిల్లులు, బియ్యం షాపుల్లో తూనికలు-కొలతల శాఖ దాడులు. నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థలపై కేసులు నమోదు చేసిన అధికారులు.

Saleem, Nalgonda
Published on: 30 Oct 2026 8:43 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడలో తూనికల శాఖ దాడులు

మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లులు, బియ్యం దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్గొండ లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ పర్యవేక్షణలో జిల్లా అధికారి ఈ దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 5 రైస్ మిల్లులు, 3 రిటైల్ షాపులపై మొత్తం 8 కేసులు నమోదు చేశారు.

బస్తాలపై తెలిపిన నికర బరువు ఉందో లేదో సరిచూసుకోవాలని, తారా బరువు (సంచి బరువు) మినహాయించి బియ్యం తూకాన్ని నిర్ధారించుకోవాలని వినియోగదారులకు సూచించారు. ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలు దాటితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda