Miryalaguda: ఆర్డీవో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జర్నలిస్టుల వినతి!
Miryalaguda: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మిర్యాలగూడ ఆర్డీవో ఆఫీస్ ఎదుట TUWJ రాస్తారోకో మీడియా కమిషన్, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు కోరుతూ ప్రజాప్రతినిధులకు వినతిపత్రం.
Miryalaguda: ఆర్డీవో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జర్నలిస్టుల వినతి!
మిర్యాలగూడ: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నల్లగొండ జిల్లా ప్రస్తుత అధ్యక్షులు కలిమెల నాగయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి అస్లాం, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు జూపల్లి బాలాజీ రావు కోరారు. ఈ మేరకు శుక్రవారం దేశవ్యాప్త ధర్నాలో భాగంగా టి యు డబ్ల్యూ జె ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆర్డీవో కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, నూతన వేజ్ బోర్డుని ఏర్పాటు చేసి పత్రిక రంగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు వేతనాలు పెంచాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులందరికి ఇల్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హెల్త్ కార్డులను మంజూరు చేసి జర్నలిస్టు కుటుంబ సభ్యులకు నగదు రహిత చికిత్సను అందించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్కడే అధికారులు మంజూరు చేయడంతో పాటు రైల్వే పాసులను ఇచ్చి ప్రయాణాలు రాయితీ కల్పించాలని అన్నారు.
అనంతరం ఆర్డీవోకు, సాగర్ రోడ్ లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ కు రాసిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు హమీద్, వాడపల్లి రమేష్, నాజీమ్, అశోక్, రంగా శ్రీనివాస్, పుప్పాల యాదగిరి వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సుమన్, కరుణాకర్, రమేష్, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్,
అశోక్, కామిశెట్టి రామకృష్ణ, హరీష్, రాజారాం, సునీల్, పేర్ల వెంకటయ్య, చిట్యాల శ్రీనివాసరావు, దొంత గాని రాంబాబు, పొదిల హరి, నగేష్, కోన శ్రీనివాస్, పాపులర్ తోఫిక్, పర్సనబోయిన శ్రీనివాస్, సురేష్, కట్ట బాబు, వసీం, మొగిలి రామకృష్ణ, మంద లక్ష్మణ్, సుదర్శన్, వంగూరి రవి, మహేష్, రాజు, పాపులర్ వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.




