Miryalaguda: మిల్లర్ల సిండికేట్ దందా ఆపాలి మిర్యాలగూడ ఆర్డీవోకు జేఏసీ వినతి

Miryalaguda: మిర్యాలగూడ రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, మిల్లర్ల సిండికేట్‌ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవోకు బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ, డీఎస్పీ వినతి.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 7 Nov 2026 6:53 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిల్లర్ల సిండికేట్ దందా ఆపాలి మిర్యాలగూడ ఆర్డీవోకు జేఏసీ వినతి

మిర్యాలగూడ: మిర్యాలగూడ పరిధిలో ఉన్నటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే *మిల్లర్ల యొక్క సిండికేట్ దందా నివారించి గిట్టుబాటు ధరలు అందించాలని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మొదట ఇక్కడి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని DSP& BC SC ST-JAC మిర్యాలగూడ నియోజకవర్గo ఆధ్వర్యంలో RDO గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ BC SC ST-JAC అధ్యక్షులు గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్,DSP జిల్లా స్టీరిం తరి ఎల్లయ్య మహారాజ్, జేఏసీ జిల్లా నాయకులు నీలకంఠం నాయక్, వజ్జగిరి అంజయ్య, కిషన్ నాయక్, DSP నాయకులు రాజశేఖర్, వెంకటేష్,శివన్.. తదితరులు పాల్గొన్నారు..

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA