Miryalaguda: మిర్యాలగూడలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ: ఉత్తమ్!

Miryalaguda: మిర్యాలగూడలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2027 నాటికి నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 6 Nov 2026 10:18 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ: ఉత్తమ్!

మిర్యాలగూడ: మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్, గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జిల్లాలో ఒక్క ఇరిగేషన్ పథకం కూడా పూర్తి కాలేదు, ప్రజా పాలనలో 2027 సంవత్సరంలోపు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తాం, డిండి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు నీటిని అందిస్తాం, మిర్యాలగూడ నియోజకవర్గం లో చెక్ డ్యాములు నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తాం.

ఎస్ ఎల్ బి సి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బస్వాపూర్ ధర్మారెడ్డి కాలువలను పూర్తి చేస్తాం, తెలంగాణలోని పలు జిల్లాలకు తాగు సాగునీరు అందించే తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభిస్తాం, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఈ ఐదు సంవత్సరాల పాలన గోల్డెన్ పీరియడ్ గా మిగిలిపోతుంది.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA