Miryalaguda: అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

Miryalaguda: మిర్యాలగూడ రూరల్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. అనుమతులు లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 13 Nov 2026 3:53 PM IST
Miryalaguda
X

Miryalaguda: అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

మిర్యాలగూడ రూరల్: అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మిర్యాలగూడ రూరల్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఉప్పు నగేష్ స్పష్టం చేశారు.

2026 నవంబర్ 12వ తేదీ తెల్లవారుజామున యాదగిరిపల్లి గ్రామ శివారులో ఎస్సై ఉప్పు నగేష్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కామేపల్లిగూడెం మూసి ప్రాంతం నుంచి మిర్యాలగూడ వైపు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను గుర్తించి పట్టుకున్నారు.

ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్, యజమాని అయిన తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన గాదె రవిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడితే వాహనాల సీజ్‌తో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే బైండోవర్ చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.

**ఇసుక మాఫియా పేరుతో అక్రమ వ్యాపారాలు సాగించినా, రాత్రివేళల్లో దొంగచాటుగా ఇసుక తరలించినా పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై ఉప్పు నగేష్ స్పష్టం చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA