Miryalaguda: మిర్యాలగూడలో హెచ్ఎంల సమావేశం: ఎంఈఓ ధర్మానాయక్!

Miryalaguda: మిర్యాలగూడలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంల సమావేశం జరిగింది. ప్రసస్తూ యాప్ నమోదు, విద్యార్థుల హాజరు శాతం పెంపుపై ఎంఈఓ ధర్మానాయక్ దిశానిర్దేశం చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 27 Oct 2026 7:11 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడలో హెచ్ఎంల సమావేశం: ఎంఈఓ ధర్మానాయక్!

మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడ నందు డి ధర్మానాయక్ మండల విద్యాధికారి మిర్యాలగూడ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనైనది.

ఈ సమావేశంలో ప్రసస్తూ యాప్ ఆన్లైన్ చేసే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది మరియు పాఠశాలల యొక్క EP GP, AXL, FLN, SA 1, ఈ వెస్ట్( తడి పొడి ఎలక్ట్రానిక్స్ మరియు మెడికల్స్) వ్యర్ధాల నిర్వహణ మరియు పాఠశాలల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని తెలియజేయడమైనది. పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరినారు.

ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ కరుణాకర్ రెడ్డి ,వడ్డే రాజు, పి.వెంకట్ రెడ్డి ,గోపయ్య, పరమేష్ ,బిక్షపతి శ్రీమతి రంజిత మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, సరిత బిసి గురుకుల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మరియు, నిరంజన్ ఎల్ డి ఏ బ్రహ్మచారి ఐ ఆర్ టి మరియు యుపిఎస్ పిఎస్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA