Miryalaguda: గూడూరు వద్ద కల్తీ కోళ్ల దాణా పట్టివేత రెండు డీసీఎంలు సీజ్

Miryalaguda: మిర్యాలగూడ మండలం గూడూరు వద్ద 60 శాతం రాయి పొడితో కల్తీ చేస్తున్న కోళ్ల దాణా డీసీఎంలను పట్టుకున్న రైతులు, పోలీసులు. బాధ్యులపై చర్యలకు డిమాండ్.

Saleem, Nalgonda
Published on: 16 Sept 2026 8:19 PM IST
Miryalaguda
X

Miryalaguda: గూడూరు వద్ద కల్తీ కోళ్ల దాణా పట్టివేత రెండు డీసీఎంలు సీజ్

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు వద్ద కల్తీ కోళ్ల దాణా పట్టివేత. రెండు డీసీఎం వాహనాలను పట్టుకున్న స్థానిక పోలీసులు, పౌల్ట్రీ ఫామ్ యజమానులు. కోళ్ల దాణాలో దాదాపు 60 శాతం వరకు రాయి పొడి కల్తీ చేస్తున్నట్లు సమాచారం.

నిఘా ఉంచి వాహనాలను పట్టుకున్న పౌల్ట్రీ రైతులు. మిర్యాలగూడ ప్రాంతం నుంచి భారీగా కల్తీ దాణా సరఫరా చేస్తున్నట్లు గుర్తింపు.

హాలియా, ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్ల నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు రైతుల ఆరోపణ. కల్తీ దాణాతో కోళ్లకు లివర్, కిడ్నీ సమస్యలు వస్తున్నాయని రైతుల ఆందోళన.

కోళ్లు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోతున్నామని పౌల్ట్రీ రైతుల ఆవేదన. కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌల్ట్రీ ఫామ్స్ యూనియన్ డిమాండ్. బాధ్యులపై కేసు నమోదు చేసి శిక్షించాలని రైతుల విజ్ఞప్తి.

Saleem, Nalgonda

Saleem, Nalgonda