Miryalaguda: అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్ పట్టాలివ్వాలి: బీఆర్ఎస్ నేత సాధినేని!

Miryalaguda: మిర్యాలగూడ 6వ వార్డు పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత సాధినేని శ్రీనివాసరావు ఆర్డీవో రమణారెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 9 Nov 2026 6:19 PM IST
Miryalaguda
X

Miryalaguda: అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్ పట్టాలివ్వాలి: బీఆర్ఎస్ నేత సాధినేని!

మిర్యాలగూడ నవంబర్ 09: మిర్యాలగూడ పట్టణం 6 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన నిరుపేదలకు గత శుక్రవారం జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీలో ఇండ్లు కేటాయించలేదని, వెంటనే అర్హులందరికీ పట్టాలు అందించాలని కోరుతూ సోమవారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు సాధినేని శ్రీనివాసరావు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో రమణారెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి, అత్యంత పారదర్శకంగా, వివిధ శాఖల అధికారుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం కూడా గత సంవత్సరం మళ్లీ ఫీల్డ్ ఎంక్వైరీ నిర్వహించి వీరినే అర్హులుగా గుర్తించిందని, అయినప్పటికీ శుక్రవారం నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రస్తుత ప్రజాప్రతినిధుల కక్షపూరిత చర్యలతో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేద లబ్ధిదారులందరికీ త్వరితగతిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను అందజేయాలని కోరారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA