Miryalaguda: మిర్యాలగూడలో 54 అడుగుల అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్ జంక్షన్‌లో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలను వైభవంగా నిర్వహించారు. 54 అడుగుల విగ్రహం ఆవిష్కరణ.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 29 Nov 2026 6:00 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడలో 54 అడుగుల అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా.. మిర్యాలగూడలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది..పట్టణంలోని హనుమాన్ జంక్షన్‌లో శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య ఆవిష్కరించారు. జై శ్రీరామ్.. జై హనుమాన్ నినాదాలతో హనుమాన్ జంక్షన్ పరిసరాలు మార్మోగాయి.

దేవాలయ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు నాగలక్ష్మి భార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.భారీ హనుమాన్ విగ్రహ ఆవిష్కరణతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా, ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA