Huzurnagar: రేపు హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ!

Huzurnagar: హుజూర్‌నగర్‌లో రేపు ఉదయం 10 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయూత పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 18 Nov 2026 10:48 PM IST
Huzurnagar
X

Huzurnagar: రేపు హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ!

హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను రేపు (నవంబర్ 19న) రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

ఈ కార్యక్రమం హుజూర్‌నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ఆర్థిక సహాయ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు స్వయంగా అందజేయనున్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR