Huzurnagar: నేడు హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన!

Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. రూ.440 కోట్లతో చేపట్టే జాన్‌పహాడ్, బెట్టె తండా లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలన.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 11 Nov 2026 7:45 AM IST
Huzurnagar
X

Huzurnagar: నేడు హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన!

Huzurnagar: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పాలకవీడు మండలంలో సుమారు రూ.440 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు నీటిపారుదల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు.

మధ్యాహ్నం 1 గంటకు పాలకవీడు మండలంలో పర్యటన ప్రారంభమవుతుంది. తొలుత రూ.400 కోట్లతో చేపడుతున్న జాన్‌పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్, జనపహాడ్ కాలువ లైనింగ్ పనులను పరిశీలిస్తారు. అనంతరం రూ.40 కోట్లతో నిర్మిస్తున్న బెట్టె తండా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, చెక్‌డ్యామ్ పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు హుజూర్నగర్ మండలంలోని కరక్కాయలగూడెంలో స్వర్గీయ అంకతి పార్వతి గారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

సాయంత్రం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు హుజూర్‌నగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణం, నూతన ఇరిగేషన్ డివిజన్ కార్యాలయ భవనం, నూతన ఆర్‌అండ్‌బీ కార్యాలయ భవన నిర్మాణ పనులను సందర్శించనున్నారు.

మంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అభివృద్ధి పనుల పురోగతి, నిర్మాణాల స్థితిగతులు, ఇతర వివరాలతో సిద్ధంగా ఉండనున్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR